ఇక ఊచకోతే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘దేవర పార్ట్ 1’ సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇప్పటివరకు బయటకు వచ్చిన  దేవర ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంది.

అయితే, దేవర పార్ట్ 1 క్లైమాక్స్ పై ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్ వినిపిస్తోంది. మొదటి పార్ట్ 1 లకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సినిమాల క్లైమాక్స్ లు అన్ని ఒక ఎత్తు అయితే, దేవర క్లైమాక్స్ మాత్రం మరో ఎత్తు అని టాక్‌ నడుస్తుంది. యాక్షన్ అభిమానులకు ఈ సినిమా క్లైమాక్స్ ఓ బంపర్‌ పీస్ట్‌ అని సమాచారం. ముఖ్యంగా దేవర ఊచకోతకు వెన్నులో వణుకు పుడుతుందని, బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామీ వస్తుందనే నమ్మకంతో మూవీ టీమ్‌ తో పాటు అభిమానులు కూడా ఉన్నారు.

మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో చూడాలి. కాగా ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories