ఏ మంచిపని కనిపించినా.. విషం కక్కడానికి రెడీ!

కూటమి ప్రభుత్వం ఏ మంచి పనిచేయడానికి పూనుకున్నా వెంటనే దానిపై విషం కక్కడానికి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు సిద్ధమైపోతూ ఉంటాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వారా.. ఒక్క మంచి పని కూడా జరగకూడదు.. పేద ప్రజల జీవితాల్లో ప్రభుత్వం పూనికవల్ల గుణాత్మకమైన మార్పు రానేకూడదు. వారి జీవితాలు బాగుపడనే కూడదు. వారిలో ప్రభుత్వం పట్ల కించత్తు అభిమానం ఏర్పడకూడదు. అలా జరిగితే.. తాము ప్రజలను మోసం చేయడానికి చెప్పే మాటలకు విలువ లేకుండాపోతుంది. తమ పన్నాగాలు పారవు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు నిత్యం విషం కక్కడానికి చూస్తున్నాయి. ఆ క్రమంలో భాగంగా.. ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడకుండా.. పేదల జీవితాలను బాగు చేసే పీ4 పథకాన్ని ప్రారంభిస్తోంటే.. దాని మీద అపోహలు కల్పించడానికి ఇప్పుడు వారు ప్రయత్నిస్తున్నారు.

పేదలకోసం తమ సొంత సంపద నుంచి విరాళాలు ఇచ్చేవారు ముందుకు వస్తోంటే.. బలవంతంగా ఇలాంటి వసూళ్లు చేస్తున్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు దుష్ప్రచారం సాగిస్తున్నాయి. మార్గదర్శులుగా నమోదు కావాలని ప్రధానోపాధ్యాయులు, టీచర్ల మీద డీఈవోలు వత్తిడి చేస్తున్నట్టుగా వస్తున్న ఆరోపణలు నిజం కాదని ఆయన అంటున్నారు. ఎవరైనా బలవంతం చేస్తే సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వొచ్చునని ఆయన చెబుతున్నారు. పీ4 ను స్వచ్ఛంద కార్యక్రమంగానే అందరూ చూడాలని ఆయన చెబుతున్నారు.

నిజం చెప్పాలంటే.. పీ4 కోసం ఎవ్వరినీ వత్తిడి చేయాల్సిన అవసరం కూడా లేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి. ఎందుకంటే.. మార్గదర్శులను ఎంపిక చేసి, వారి అంగీకారాన్ని పొందే బాధ్యతను చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. వారు తమ తమ పరిధిలోని పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు, పెట్టుబడిదారులతో సమావేశాలు జరుపుతున్నారు. వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ కోణంలో చూసినప్పుడు.. ప్రతి పరిశ్రమ, లేదా, పెద్ద కంపెనీ కూడా తమ లాభాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖచ్చితంగా డబ్బు కర్చు పెట్టాల్సిన పరిస్థితిలో ఉంది. అది అనివార్యం చేశారు. ఇలా కంపెనీలు తమ తమ సీఎస్ ఆర్ నిధులను ఖర్చు పెట్టడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థలను కూడా ఏర్పాటుచేసుకుని.. అందుకు మళ్లీ కొంత ఖర్చు పెడుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం పీ4 లో సీఎస్సార్ నిధులు కూడా పెట్టవచ్చునని వెసులుబాటు ఇచ్చింది. ఇది దాదాపుగా అన్ని కంపెనీలు, పరిశ్రమలకు చాలా వెసులుబాటు అవుతుంది. సీఎస్సార్ నిధుల ఖర్చుకోసం తాము మళ్లీ ఉద్యోగులను, వ్యవస్థలను ఏర్పాటుచేసుకోకుండా ప్రభుత్వం ఎంపిక చేసే బంగారు కుటుంబాలకు ఇస్తే అక్కడితో సరిపోతుంది. తమకు బ్యాలెన్స్ షీట్ పరంగా సీఎస్సార్ నిధుల పరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలాగే.. ప్రభుత్వం సంతృప్తి చెందుతుంది. వారు చేసినా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఆ మాత్రం దానికి ఎవ్వరినీ బలవంతం చేసి ఇందులోకి తీసుకురావాల్సిన అవసరం లేదని పలువురు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories