హీరోయిన్ గా ఎంత వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుందో అంతే ఫాస్ట్ గా సినిమా అవకాశాలు లేకుండా చేసుకుంది శ్రీలీల. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే సమయానికి ఆమె చేతి నిండా సినిమాలున్నాయి. బిజీ హీరోయిన్ గా పేరు కూడా తెచ్చుకుంది. కానీ ఏడాది తర్వాత ఈరోజు చూస్తే పరిస్థితి తారుమారయ్యింది.
ఆమె చేతిలో ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా అందులో పవన్ సినిమా పక్కన పెడితే ఇంకోటి అంత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా కాదు. ఆమె స్టార్ హీరోలతో చేసిన సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో ఆమెను మళ్లీ మళ్లీ తీసుకునేందుకు నిర్మాతలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్, గ్రేస్ ని ఆధారంగా చేసుకుని ఆమెకు రెండు ఐటెం సాంగ్ ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం.
ఒక బడా బాలీవుడ్ సినిమాతో పాటు తమిళ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమాలో సైతం ఐటమ్ సాంగ్ చేయాల్సిందిగా ఆమెను నిర్మాతలు కోరారట. అయితే తన కెరీయర్ని దృష్టిలో పెట్టుకుని తాను ఐటెం భామగా మారే ఉద్దేశమే లేదని ఆమె తేల్చి చెప్పినట్లుగా సమాచారం. నిజానికి తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఒక పక్క హీరోయిన్లుగా సినిమాలు చేస్తూనే ఐటెం సాంగ్ వచ్చినప్పుడు ఏమాత్రం కాదనకుండా వాటిని చేస్తూ వెళ్లారు.
కానీ శ్రీ లీల మాత్రం అలా చేసేందుకు ఏమాత్రం ఇష్టపడలేదని తెలుస్తోంది. తనకు అలా మారే ఉద్దేశం లేదని హీరోయిన్ గా మాత్రమే చేస్తారని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. నితిన్ సరసన రాబిన్ హుడ్, పవన్ కళ్యాణ్ పక్కన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు హిట్లు కొట్టాలని అనుకుంటుంది. తర్వాత కచ్చితంగా హీరోయిన్ గానే కొనసాగుతానని ఆమె చెబుతోంది.