నాటకాలు కుదరవ్.. మీ వాదనేంటో చెప్పాల్సిందే!

జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం విచ్చలవిడిగా రెచ్చిపోయి.. ఆయన కక్షకట్టిన ప్రత్యర్థులందరినీ వేధించడమే తన ఉద్యోగధర్మం అన్నట్టుగా ప్రవర్తించిన ఒక ఐపీఎస్ అధికారి తర్వాత కేసుల్లో ఇరుక్కున్నారు. ఆయనకు బెయిలు కూడా లభించింది. అయితే తమ వాదనలు వినకుండానే బెయిలు ఇచ్చేశారని, ఈ బెయిలును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్కడ అసలు కేసు విచారణే జరగకుండా సాగతీసేందుకు.. సదరు అధికారి కుయుక్తులు ప్రదర్శిస్తున్నట్టుగా ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు. వాయిదాలుమీద వాయిదాలు పడేలా సాగదీస్తున్నారని కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా సాగదీస్తే కుదరదు.. గురువారం మీ వాదన ఏంటో చెప్పాల్సిందే అని హుకుం జారీచేసింది. దీంతో.. ఏపీలో జగన్ పరిపాలన కాలంలో.. సీఐడీ చీఫ్ గా పనిచేసి.. జగన్ ఆనందం కోసం దుర్మార్గంగా అందరినీ వేధించిన ఐపీఎస్ అధికారి సంజయ్ ఇప్పుడు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.

సీఐడీ మాజీచీఫ్ సంజయ్ అదివరకు అగ్నిమాపక శాఖలో కూడా విధులు నిర్వర్తించారు. ఆ శాఖలో పనిచేస్తున్నప్పుడు నిబంధనలు అతిక్రమించి, అవినీతికి పాల్పడ్డారంటూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద కేసు నమోదు అయింది. అప్పట్లో ఆయన తన తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు రెండుకోట్లరూపాయల నష్టం కలిగించారనే అభియోగాలు ఉన్నాయి. వీటిపై ఆయనను ప్రధాన నిందితుడుగా చేరుస్తూ ఏసీబీ కేసులు నమోదు చేసింది. హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిలు మంజూరుచ చేసింది. అసలు ఏసీబీ తరఫు వాదనలు వినకుండానే ముందస్తు బెయిలు ఇచ్చేశారంటూ.. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ సందర్భంలో ముందస్తు బెయిలు కోసమే ఏకంగా 49 పేజీల తీర్పు హైకోర్టు వెలువరించడం పట్ల విస్మయం వ్యక్తంచేసిన సుప్రీం.. కేసు ట్రయల్ మొత్తం అప్పుడే పూర్తిచేసినట్టుగా ఉన్నదని వ్యాఖ్యానించింది. అయితే సంజయ్ తరఫు న్యాయవాది లేకపోవడంతో వాయిదా పడింది. తాజాగా కూడా విచారణకు వచ్చినప్పుడు సంజయ్ తరఫు సీనియర్ న్యాయవాది రాలేదని కోర్టుకు తెలిపారు. వాయిదా కావాలని కోరారు.
గతంలో కూడా ఇలాగే చేశారని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో.. కేసును విచారణకు రానివ్వకుండా సాగదీయడానికి ఇలా చేస్తున్నారన్నట్టుగా సుప్రీం కోర్టు ఆగ్రహించింది. గురువారానికి వాయిదా వేసి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోజు సంజయ్ తరఫున వాదనలు వినిపించాలని.. ఆ సీనియర్ రాకపోతే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని కోర్టు హెచ్చరించింది.

గతంలో కూడా పోలీసు వాదనను వినకుండా హైకోర్టు మంజూరుచేసిన మరో బెయిలు ను సుప్రీం కొట్టివేసింది. ఇప్పుడు కూడా.. సంజయ్ కేసు విషయంలో హైకోర్టు తీర్పును కొట్టివేయడం గ్యారంటీ అని, కేసును తొలినుంచి పూర్తిగా మళ్లీ విచారించి తీర్పు ఇవ్వాలని సుప్రీం ఆదేశించవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. ఆ భయంతోనే కేసు విచారణ సాగనివ్వకుండా వాయిదాలు కోరుతున్నట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories