నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా సినిమా “అఖండ 2 తాండవం” గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి పాన్ ఇండియా ఆడియెన్స్ ని తాండవం ఎత్తించేందుకు తాను రెడీ చేస్తున్నారు. ఇక భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ అంతా శరవేగంగా పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్తుండగా నేడు దర్శకుడు బోయపాటి శ్రీను పుట్టినరోజు కావడంతో మేకర్స్ పవర్ఫుల్ గా శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే ఇదే విషెస్ తో గత కొన్ని రోజులు నుంచి విపిస్తున్న అఖండ 2 రిలీజ్ రూమర్స్ పై కూడా చెక్ పెట్టేసారు. ఈ సినిమా సెప్టెంబర్ రేస్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లినట్టుగా తెలుస్తుంది. కానీ ఇపుడు దీనిపై ఓ పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఆ రూమర్స్ లో నిజం లేదని సెప్టెంబర్ 25నే దసరా కానుకగా థియేటర్స్ లో అఖండ 2 రాబోతుంది అని తేల్చి చెప్పేశారు. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పొచ్చు.