టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “రాబిన్ హుడ్”. భీష్మ సినిమా తర్వాత వచ్చిన ఈ చిత్రం మరోసారి ఎంటర్టైనర్ గా అయితే నిలిచింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ ఉగాది కానుకగా విడుదల కాగా యూఎస్ మార్కెట్ లో మంచి ఓపెనింగ్స్ ని ఈ చిత్రం డే 1 కి అందుకుంది. అక్కడ మొదటి రోజుకి లక్ష డాలర్స్ కి పైగా గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది.
ప్రస్తుతం అయితే అక్కడ స్టడీ కనబరుస్తున్న ఈ చిత్రం వీకెండ్ లో ఎలాంటి నంబర్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో ఆదిపురుష్ నటుడు దేవదత్త నాగే విలన్ రోల్ లో నటించగా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఇక వీరితో పాటుగా డేవిడ్ వార్నర్ కూడా సాలిడ్ క్యామియోలో కనిపించారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మోవీబీఎ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.