భూమన భవిష్యత్తుపై నీలాయపాలెం జోస్యం!

తిరుపతి  మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ ఛైర్మన్ గా ఉన్న రోజుల్లో పాల్పడిన విచ్చలవిడి అవినీతి ఫలితంగా.. ఆయన త్వరలోనే జైలుకు వెళ్లాల్సి వస్తు ందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ జోస్యం చెబుతున్నా.రు తిరుపతికి చెందిన నీలాయపాలెం తిరుపతిలోనే నిర్వహించిన మీడియా సమావేశంలో- భూమన రాజకీయ భవిష్యత్తు గురించి తీవ్రమైన విమర్శలు చేయడం విశేషం. చేసిన తప్పుల నుంచి భూమన ఎప్పటికీ తప్పించుకోలేరని, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని.. నీలాయపాలెం విజయకుమార్ భవిష్యత్తు వాణిని వినిపిస్తున్నారు.
నిజానికి కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. చవకబారు విమర్శలతో భూమన కరుణాకర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బిఆర్ నాయుడు కూడా కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగిన సకల అవినీతి కార్యకలాపాలను ఒక జాబితాగా మీడియా సమావేశంలో ఏకరువు పెట్టారు.

బిఆర్ నాయుడు ఎంత నిశిత విమర్శలు చేశారంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీటీడీ చైర్మనుగా పనిచేసిన ఇతర నాయకులు కూడా ఎంతో కొంత పద్ధతిగా నడుచుకుని వెళ్లారు గాని భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత కోట్లకు కోట్ల రూపాయలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని తీవ్రంగా విమర్శించారు. భూమనకంటె వైవీ సుబ్బారెడ్డి అవినీతి తక్కువ అని బిఆర్ కితాబు ఇచ్చినట్టు అయింది. భూమన, ఆయన కొడుకు అభినయ రెడ్డి ఇద్దరు కలిసి విచ్చలవిడిగా దందాలు చేశారని, వారి అప్పటి అవినీతి వ్యవహారాలపై తప్పకుండా విచారణ జరిపించి తీరుతామని బిఆర్ నాయుడు హెచ్చరించారు.

కరుణాకర్ రెడ్డి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిఆర్ నాయుడు చేసిన హెచ్చరికలను.. ఇప్పుడు నీలాయపాలెం విజయకుమార్ చెబుతున్న భూమన కరుణాకర్ రెడ్డి భవిష్యత్తు జోస్యంతో కలిపి అన్వయించి చూసుకుంటే.. భూమనకు జైలు జీవితం తప్పేలా లేదు- అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తెలుగులో పదాల మధ్య మంచి విరుపులతో, కవితాత్మకంగా మాట్లాడుతూ నీతులు చెబుతూ ఉండే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న రోజుల్లో ఎంత అడ్డగోలుగా దోచుకున్నారో స్థానికంగా కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. నీలాయపాలెం విజయకుమార్ కూడా స్థానికులే కావడం వలన ఆయనకు తెలియని దందాలు ఉండకపోవచ్చు. బి ఆర్ నాయుడు కూడా అదే జిల్లాకు చెందిన వ్యక్తి అనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి వారు గట్టిగా పట్టు బిగిస్తే భూమన ఆడిన అవినీతి బాగోతాలన్నీ బయటకు వస్తాయి.. అని ఇప్పటికే జైలుజీవితం అనుభవిస్తున్న అనేకమంది వైయస్సార్ కాంగ్రెస్ నాయకుల మాదిరి గా భూమన కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories