టాలీవుడ్ యంగ్ నటుడు నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వా నిఖిల్ ఎంచుకున్న కథలు నిఖిల్ ని ఎక్కడికో తీసుకుని వెళ్లిపోయాయి. స్వామి రారా, కార్తికేయ, కార్తికేయ 2 వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.
అయితే తాజాగా ఈ నటుడి చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది.ఏపీ లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ గుడి మూసి ఉంది. అయితే ఈ ఆలయాన్ని తిరిగి నిఖిల్ తెరిపించాడు. ఆలయాన్ని తెరిపించడమే కాకుండా దాని నిర్వహణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఈ విషయాన్ని నిఖిల్ ఇన్‌స్టా వేదికగా అభిమానులకు తెలియజేశాడు.
చాలా సంవత్సరాలుగా మూసేసిన ఆలయాన్ని నిఖిల్ తెరిపించడంతో ఆయనపై గ్రామస్థులు ఆదరాభిమానాలు కురిపించారు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్‌ను పూలపై నడిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.