పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఓజి సినిమా కూడా ఒకటి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్‌లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ కొంతవరకే పూర్తవగా, మధ్యలో కొన్ని కారణాల వల్ల పనులు కొంత ఆలస్యం అయ్యాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన వున్న సినిమా కమిట్మెంట్స్ పూర్తి చేసి, ఇప్పుడు పూర్తిగా ఓజి సినిమా పనులపై దృష్టిపెట్టారు.
ఇటీవల ముంబైలో ఓ కీలక షెడ్యూల్ పూర్తయ్యింది. ఇప్పుడు వచ్చే షెడ్యూల్ విజయవాడలో జరగనుంది. జూన్ 5న ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్‌ను జూన్ 16తో ముగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ షెడ్యూల్ పూర్తయ్యే సరికి మొత్తం సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం.
సినిమా నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి, దాదాపు అన్ని కార్యాలు సెప్టెంబర్ 25న రిలీజ్‌కు సెట్ చేస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. పవన్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.