No menu items!
No menu items!

బాలయ్య బాబు కోసం కొత్త సెట్స్‌!

నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై బోయపాటి కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మరోవైపు లొకేషన్స్ ను కూడా ఇప్పటికే బోయపాటి సెలెక్ట్‌ చేసి ఫైనల్‌ చేసేశాడంట.

జనవరి మూడో వారం నుంచి ఆఖండ పాత్రకు సంబంధించిన ఎంట్రీ సన్నివేశాలను రూపొందిస్తారంట. ఇందులో భాగంగానే బాలయ్య ఇంట్రో కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

థమన్ ఈ సినిమాకు  సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఏర్పడ్డాయి.   

Related Posts

Comments

spot_img

Recent Stories