బాలయ్య బాబు పై కొత్త రూమార్‌!

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ యాక్షన్ అండ్ ఎమోష‌న‌ల్ డ్రామాలోని ఫ్లాష్ బ్యాక్ పై ఇప్పుడు ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య రెగ్యులర్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని, ముఖ్యంగా సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఇంకా పెరిగాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories