సరికొత్త రికార్డులు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీమ్‌ నిన్న ‘పెద్ది గ్లింప్స్‌’ రిలీజ్ చేసింది. సినిమాలో రామ్‌చరణ్‌ పాత్ర ఏవిధంగా ఉండనుందో ఈవీడియోలో చూపించారు. మొత్తానికి మాస్‌ అవతార్‌లో చరణ్‌ లుక్‌ అదిరిపోయింది.

అయితే, చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ షాట్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన తెలుగు గ్లింప్స్‌గా నిలిచింది. సింగిల్ ఛానెల్ లో 24 గంటల్లోనే పెద్ది ఫస్ట్ షాట్ 36.5 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.

కాగా ఈ వీడియోలో చరణ్ చెప్పిన డైలాగ్‌లు కూడా ఈలలు వేయించేలా ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్‌ చివర్లో చరణ్‌ కొట్టిన సిక్స్‌ షాట్‌ మాత్రం అదరహో అనిపించేలా ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రగడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అన్నట్టు గ్రామీణ నేపథ్యంలో క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోన్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories