ఒక్కషాట్‌ తోనే మాస్‌ జాతర!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ డైరెక్టర్‌ శంకర్‌  కాంబో లో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్”.  మరి సాలిడ్ హైప్ ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సినిమాకి ఇంకా నెల ఉంది అనగా మేకర్స్ అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు.

అయితే ఈ సినిమా నుంచి తాజాగా వదిలిన ఓ ప్రోమో కట్ ఇపుడు ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసింది అని చెప్పాలి.ఇందులో ముందు కొన్ని షాట్స్ అన్నీ టీజర్ లో ఉన్నవే ఉన్నాయి కానీ ఒక్క పర్టిక్యులర్ షాట్ తో మాత్రం మరింత ఆసక్తి రేపారు డైరెక్టర్. చరణ్ షూ తో కింద నుంచి పై వరకు తీసిన ఒక స్టైలిష్ టేక్ ఇపుడు ఇండస్ట్రీలో డిస్కషన్ గా మారింది.

ఇలాంటి మొకోబాట్ కెమెరా సన్నివేశాలు ఇంకా ఉంటే అదిరిపోతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి మొత్తానికి అయితే చిన్నదే అయినా గేమ్ ఛేంజర్ పట్ల ఇపుడు మరింత ఆసక్తి నెలకొంది.

Related Posts

Comments

spot_img

Recent Stories