తండేల్ నుంచి కొత్త పోస్టర్!

యువ సామ్రాట్ నాగ చైతన్య 2009లో జోష్‌తో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి మోస్ట్ సక్సెస్ ఫుల్ యాక్టర్ గా ఎదిగి యువ సామ్రాట్‌ కి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. విలక్షణమైన పాత్రలలో అనేక సూపర్ హిట్‌లను అందించిన నాగ చైతన్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా, నాగ చైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్ మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు.

పోస్టర్‌లో రగ్గడ్ అవతార్‌లో కనిపించిన నాగ చైతన్య తన చిరునవ్వుతో కట్టిపడేస్తున్నాడు. ఇక చైతు సముద్రం దగ్గర ఫిషింగ్ బోట్ మీద నిలబడి కనిపించిన ఈ పోస్టర్ సూపర్‌ గా ఉంది.చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. 

Related Posts

Comments

spot_img

Recent Stories