కాంతిరాణా మాటలతో సరికొత్త సందేహాలు!

జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించినప్పుడు తగినంత భద్రత కల్పించామని నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా చెబుతున్నారు. జగన్ మీద దాడి జరిగిన తర్వాత రెండోరోజు ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన అధికారుల వైఫల్యానికి సంబంధించి వెల్లువెత్తుతున్న ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ స్పెషల్ ఫోర్స్ నుంచి నాలుగు ప్లాటూన్లతోపాటు, ఆక్టోపస్ టీం, సీఎం సెక్యూరిటీ కూడా ఉణ్నదని చెప్పారు. సీఎం సెక్యూరిటీపై అన్నివర్గాల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ వివరణ అనివార్యంగి ఇచ్చినట్టుగా ఉంది. అయితే కాంతిరాణా టాటా చెబుతున్న కొన్న విషయాలు కొత్త సందేహాలను పుట్టిస్తున్నాయి. ‘సీఎం యాత్రలో విద్యుత్తు నిలిపివేయడం అనేది సెక్యూరిటీ ప్రోటోకాల్ లో భాగమే అని చెబుతున్నారు. వీవీఐపీలు పర్యటిస్తున్నప్పుడు.. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు వారి వాహనశ్రేణి వెంట జెనరేటర్ ను కూడా తీసుకువెళ్లడం కొన్ని సందర్భాల్లో గమనిస్తుంటాం. అయితే పోలీసు కమిషనర్ మాత్రం.. వీవీఐపీ ప్రోటోకాల్ లో విద్యుత్తు సరఫరా తీసేయడం ప్రోటోకాల్ లో భాగం అంటున్నారు.

అంతపెద్ద అధికారి చెబుతున్నారు గనుక నిజమే కావొచ్చు. కానీ.. వాహనానికి తగులుతాయనే ఉద్దేశంతో ప్రోటోకాల్ లో భాగంగా విద్యుత్తు వైర్లు మొత్తం కత్తిరించేసిన  అధికారులు.. ఆ చీకట్లో వాహనం మీద నిల్చుని వీవీఐపీ ప్రయాణించడానికి ఎలా అనుమతించారు. చీకట్లో అలా ప్రమాదకరమైన పరిస్థితిలో వీవీఐపీని తీసుకువెళ్లడం కూడా భద్రత ప్రోటోకాల్ లో భాగమేనా? అనే ప్రశ్నలు ప్రజలనుంచి వస్తున్నాయి. జగన్ మీద ఎవడో రాయి విసిరాడు గనుక సరిపోయింది. బలంగా రాయి విసిరాడు అని కమిషనర్ అంటోంటే.. ఎయిర్ గన్ వాడినట్టుగా తెలుస్తోంది అని వైసీపీ దళాలు అంటున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. రాయి కాకుండా అలాంటి పరిస్థితిలో ఎవడైనా తుపాకీతో కాల్చి ఉంటే పరిస్థితి ఏమిటి? అప్పుడు పోలీసులు ఏం సమాధానం చెబుతారు. చంద్రబాబునాయుడు కాల్పించాడు అని వైసీపీ దళాలు పాట పాడుతాయి సరే.. జరిగిన నష్టానికి బాధ్యత వహించేది ఎవరు? అనేది ప్రజల సందేహం.

వాహనానికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బిగించుకున్నారంటేనే.. బుల్లెట్ ద్వారా ఏర్పడగల ప్రమాదాలను అంచనా వేస్తున్నట్టు లెక్క. మరి చీకటిని ఏర్పాటుచేసి.. జనం రద్దీ ఉండే రోడ్డులో, వాహనం మీదికి నాయకుడిని ఎక్కించి తీసుకువెళ్లడానికి పోలీసులు ఎలా అనుమతించారు.. భద్రత ప్రోటోకాల్ అంటేఇదేనా అని ప్రజలు అడుగుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories