జిమ్‌ లో తెగ కష్టపడుతున్న సామ్‌…ఎందుకంటున్న నెటిజన్లు!

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయా చేశావే అంటూ వచ్చి కుర్రకారు గుండెల్లో సెటిల్‌ అయిపోయింది. ఆ తరువాత స్టార్‌ హీరోలందరితో సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా గడిపింది. చేతినిండా సినిమాలు ఉన్న సమయంలోనే, కెరీర్‌ ఫుల్‌ పిక్స్‌ లో ఉండగానే అక్కినేని వారసుడితో మూడు ముళ్లు వేయించుకుంది.

కానీ ఆ ముచ్చట ఎంతో కాలం నిలవలేదు. భర్త నుంచి విడాకులు తీసుకుని వేరు పడింది. సినిమాలు చేస్తుంది కానీ అవి అనుకున్న స్థాయిలో హిట్ కావడం లేదు. దీంతో సైలెంట్ అయిపోయింది. అయితే తాను మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించింది. తరువాత దాని నుంచి కోలుకుని మళ్లీ సినిమాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఏడాది పాటు సినిమాలకు దూరం అవుతున్న అని తెలిపి అభిమానులకు షాక్‌ ఇచ్చింది.

అయితే సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటూ తన ఫొటోలను ఎప్పటికప్పుడూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా సామ్‌ జిమ్‌ లో వర్కౌట్లు చేస్తున్న వీడియోను ఒకదానిని సోషల్‌ మీడియాలో పెట్టింది. అది పెట్టిన క్షణాల్లోనే తెగ వైరల్‌ గా మారింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇప్పుడు జిమ్‌ లో ఇలా వర్కౌట్‌ లు చేయడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం సమంత సీటాడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌ లో నటిస్తుంది. త్వరలోనే ఈ సిరీస్‌ విడుదల కాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories