తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంట్టైనర్ మూవీగా ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ని కూడా ప్రకటించారు.
కేవలం అనౌన్స్మెంట్ టీజర్‌తోనే ‘జైలర్ 2’ సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. అయితే, ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినపడుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఓ కీలక పాత్రలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు నెల్సన్. దీనికోసం ఓ పవర్ఫుల్ పాత్రను కూడా నెల్సన్ డిజైన్ చేశాడని.. త్వరలోనే బాలయ్యను ఈ సినిమాకు అంగీకరించేలా అతడు ప్రణాళికలు రచిస్తున్నాడంట.
అంతేగాక, ఇప్పుడు మరో కాప్ పాత్రలో నటించేందుకు ఓ తెలుగు యంగ్ హీరోను కూడా సిద్ధం చేయనున్నాడట నెల్సన్. ఇలా ‘జైలర్ 2’ మూవీ కోసం ఏకంగా ఇద్దరు తెలుగు హీరోలను సిద్దం చేసేందుకు నెల్సన్ ప్లాన్ చేస్తుండటం ఇప్పుడు టాలీవుడ్ సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా అయ్యింది.