తెలుగుదేశం- భాజపా- జనసేన కలిసి ఇవాళ ప్రజాగళం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నాయి. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కలిసి.. ఏపీలో దురహంకారంతో కూడిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అంతమొందించడానికి సమరశంఖం పూరించనున్నారు. ఏపీ రాష్ట్రం సరైన రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే.. ఎన్డీయే కూటమిని ఎందుకు గెలిపించాలో ప్రధానమంద్రి నరేంద్రమోడీ ఈ సభావేదికమీదనుంచి ప్రజలకు పిలుపు ఇవ్వున్నారు. అయితే ఈ సభకు సంబంధించి ప్రజల్లో అపోహలు కలిగించడానికి, పొత్తులు దెబ్బతింటున్నాయంటూ విషప్రచారం సాగించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు పనిచేస్తూ ఉండడం గమనార్హం.
రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైసీపీ దళాలు ఒక ప్రచారాన్ని విపరీతంగా సాగించాయి. అదేమిటంటే.. చిలకలూరిపేటలో ఎన్డీయే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోడీ రావడం లేదు- అనేదే! మోడీకి అసలు ఈ సభకు రావడం ఇష్టం లేదని, ఏపీలో ఎన్నికల ప్రచారానికి వీలైనంత దూరంగా ఉండాలనే ఆయన అనుకుంటున్నారని, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాను కూడా ఉపయోగపడడం ఇష్టం లేదని ఇలా రకరకాలుగా ఒక విషపూరితమైన ప్రచారం సోషల్ మీడియాలో వెల్లువెత్తింది. ఇంత దారుణంగా జరుగుతున్న ప్రచారాన్ని చూసి.. సాధారణ ప్రజలు చాలా మందిలో కొత్తగా సందేహాలు కూడా మొలకెత్తాయి. ‘అవునా.. మోడీ సభకు రావడంలేదా’ అంటూ వారు తమకు తెలిసిన వారిని అడిగి క్లారిఫై చేసుకుంటూ వచ్చారు. పొత్తులు విడిపోతున్నారా? అనే అనుమానాలకు కూడా కొందరు వచ్చారు. నిజం చెప్పాలంటే.. ఇలాంటి నీలిప్రచారం, విషపూరితమైన ప్రచారం నిర్వహించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు ఆశించింది కూడా అదే! పొత్తులు కొనసాగడం లేదేమే అనే అనుమానాలను ప్రజల్లో నాటడం, ఆ మేరకు పార్టీల కార్యకర్తల్లో కూడా పొత్తుల గురించి భయాలను అనుమానాలను కలిగించడం లక్ష్యంగా వారు ఈ పనిచేశారు.
అయితే చిలకలూరిపేట ప్రజాగళం సభ విషయానికి వస్తే.. తతిమ్మా రెండు పార్టీల కంటె కూడా భారతీయ జనతా పార్టీ ఈ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలుగుదేశం, జనసేన కంటె వారు ఎక్కువగా దీని గురించి ప్రచారం చేస్తున్నారు. మోడీ సభలో పాల్గొంటున్న సందర్భంగా భాజపా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలను కూడా వేయించింది. మోడీ ఏపీకి రావడం అనేది.. రాష్ట్రంలో తమ పార్టీ గొప్ప ఊపు ఇస్తుందని, ఎన్నికల్లో ఘనవిజయానికి అది పునాది వేస్తుందని అనుకుంటున్నారు. సభ జరిగే ముందు రోజు వరకు మోడీ రాక గురించి అబద్ధాలను ప్రచారం చేసిన వైసీపీ నీలిదళాలన్నీ ఇప్పుడు మౌనం పాటిస్తున్నాయి.