బాలయ్య బాబుకి ఎన్బీకే 109 టీం ప్రత్యేక విషెస్‌!

మన టాలీవుడ్ లో  నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక లెజండరీ హీరో . తాజాగా బాలయ్య బాబు తెలుగు సినిమాలోకి పరిచయం అయ్యి 50 ఏళ్ళు పూర్తి చేసుకొని ఒక అరుదైన ఘట్టాన్ని తన జీవితంలో  పూర్తి చేసుకున్నారు. దీంతో అభిమానులు ఈ అరుదైన అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేడుక చేసుకుంటున్నారు.

అయితే బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఇప్పుడు తనతో పని చేస్తున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి తమ శుభాకాంక్షలు అందజేశారు. “కొంతమంది రూల్ చెయ్యాలంటే కిరీటం కావాలి, కానీ బాలయ్యకి తన చిరు నవ్వు చాలు” అంటూ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారికి ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు  NBK 109 టీం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో శుభాకాంక్షలు తెలియజేసారు. దీంతో ఈ కొత్త పోస్టర్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories