ఓటీటీలోకి నయన్‌ కొత్త సినిమా!

ప్రస్తుతం పలు చిత్రాలు థియేటర్స్ లోనే కాకుండా నేరుగా ఓటిటిల్లో కూడా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్ల కితం కోవిడ్ సమయంలో వేరే దారి లేక పలు చిత్రాలు నేరుగా ఓటిటిలో వచ్చేవి కానీ ఇపుడు కూడా కొన్ని సినిమాలు ఓటిటి లోనే వస్తున్నాయి. ఇలా స్టార్ హీరోయిన్ నయనతార నటించిన లేటెస్ట్ సినిమా కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కే రాబోతుంది.

దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో నయన్ సహా నటుడు సిద్ధార్థ్ మరియు మాధవన్ లాంటి స్టార్స్ నటించిన కొత్త చిత్రం “టెస్ట్” పాన్ ఇండియా భాషల్లో ఈ ఏప్రిల్ 4 నుంచి డైరెక్ట్ స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా ఇపుడు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తుండగా ఎస్ శశికాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రానికి శశికాంత్ తో పాటుగా చక్రవర్తి రామచంద్ర సంయుక్తంగా నిర్మాణం వహించారు. మరి ఈ సినిమాకి ముందు నయన్ నటించిన ‘అన్నపూరణి’ సినిమా కూడా నేరుగా ఓటిటిలోనే రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories