జాతిరత్నం కూడా ఈ రేసులోనే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ అందించే యువ హీరో నవీన్ పొలిశెట్టి కూడా ఒకరు. మరి నవీన్ హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అలాగే జాతి రత్నాలు సినిమాతో మంచి ఫేమ్ తను అందుకోగా ఆ తర్వాత స్టార్ నటి అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అయితే తాను హీరోగా నటిస్తున్న మరో అవైటెడ్ సినిమానే “అనగనగా ఒక రాజు”.

మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోమో, టీజర్ లతో ఆకట్టుకున్న ఈ సినిమా పట్ల ఆడియెన్స్ లో మంచి బజ్ ఉంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్ కి రాబోతుంది అని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ రేస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర తారల సినిమాలు కూడా ఉన్నాయి. మరి చూడాలి నవీన్ సినిమాపై ఎలాంటి క్లారిటీ వస్తుంది అనేది.

Related Posts

Comments

spot_img

Recent Stories