అనగనగ ఒక  రాజుగా ప్రేక్షకుల ముందుకు నవీన్‌ పోలిశెట్టి!

నవీన్ పోలిశెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్‌ హీరో ల్లో మంచి కంటెంట్‌ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో.  నవీన్‌ చేసింది తక్కువ సినిమాలే అయినా సరే కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. హీరో కాకముందు నవీన్ చిన్న సినిమాలలో కొన్ని పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కుర్ర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

అందులో అద్భుతమైన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించాడు. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నవీన్ జాతి రత్నాలు సినిమాలో చేశాడు.  ఈ సినిమాలో నవీన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన స్టైల్ మ్యానరిజంతో ప్రేక్షకులను బాగా మెప్పించాడు నవీన్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కూడా బాగానే కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత మరో వైవిధ్యమైన కథ ను ఎంచుకొని స్టార్‌ హీరోయిన్‌ అనుష్కతో కలిసి మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి అనే సినిమాను చేశాడు.

ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే మెప్పించిందని చెప్పవచ్చు.ఇక ఇప్పటివరకు కేవలం మూడు సినిమాల్లోనే హీరోగా నటించిన నవీన్.. సినిమా తీయడానికి టైం ఎక్కువగా తీసుకున్న మంచి సినిమా చేస్తాడన్న నమ్మకం మాత్రం అందరికీ ఏర్పడింది. ఇకపోతే చాలా రోజులుగా నవీన్ పోలిశెట్టి నుండి కొత్త సినిమా అప్డేట్ ఏది రాలేదనుకున్న సమయంలో.. తన ఆరోగ్య పరిస్థితి గురించి అప్డేట్ ఇచ్చాడు.

తానుగా పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానని.. దురదృష్టవశాత్తు తన చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని., కాలికి కూడా దెబ్బ తగిలిందని.. ఇది నాకు చాలా టఫ్ టైం అండ్ పెయిన్ ఫుల్ టైం అంటూ.. బాగా క్రియేటివ్ గా ఆలోచించి ఓ పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్టులో తనకు  గాయాల వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా సినిమాలతో రాలేకపోతున్నాను.  అందుకు సారీ అంటూ తెలుపుతూనే.. మరోవైపు శుభవార్త ఏంటంటే.. ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న అనగనగా ఒక రాజు సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా మీకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories