నవీన్ ఈజ్‌ బ్యాక్‌!

హీరో నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్ టు ఇండస్ట్రీ. గాయం నుంచి కోలుకున్న తర్వాత నవీన్ పోలిశెట్టి ఆహాలో మెరిశారు. ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, 21, 22వ ఎపిసోడ్‌లలో మరోసారి తన ఎనర్జీటిక్ పెర్ఫార్మెన్స్‌ తో  అదరగొట్టారు. ఈ షో లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ని క్రియేట్ చేశారని నిర్వాహకులు తెలిపారు. టాలెంట్ పవర్ హౌస్ అయిన నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్ ఈ వారం ప్రసారం కాబోతుంది.

తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్, జడ్జ్ లని మెస్మరైజ్ చేశారనే టాక్ వినిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ షోలో నవీన్ పాడిన రెండు పాటలు కూడా బాగా వచ్చాయంట.అంతేకాదు ఈ ఎపిసోడ్స్ లో చాలా హైలెట్స్ ఉన్నాయని, నవీన్ గాయం నుంచి కోలుకున్న తన జర్నీని చెప్పిన తీరు చాలా స్ఫూర్తిని ఇచ్చింది.

ఆ కష్టమైన క్షణాలని కూడా చాలా హ్యూమర్స్ గా చెప్పడం అలరించింది. కష్టాన్ని కూడా ఎంత తేలిగ్గా దాటోచ్చో నవీన్ చెప్పిన తీరు గిలిగింతలు పెడుతూనే హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఈ ఇక ఎపిసోడ్ లో నవీన్ పేల్చిన కామెడీ పంచులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ గ్రౌండ్ బ్రేకింగ్ ఎంటర్ టైన్మెంట్ ఎపిసోడ్ కోసం ఆహా లో శుక్రవారం,శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3ని మిస్ అవ్వొద్దని నిర్వాహకులు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories