మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతటి విపరీత బుద్ధులతో ఉంటారో సోషల్ మీడియాలో సొంత వారి మీదనే ఎలాంటి దుర్మార్గమైన పోస్టులు పెట్టించి వికృత ఆనందం పొందుతుంటారో ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చకు వస్తోంది. హిందూస్తాన్ టైమ్స్ పత్రిక నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్ లో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రస్తావించిన అంశాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆలోచింపజేస్తున్నా యి. అలవిమాలిన అధికార దాహం ఉన్న ఒక దుర్మార్గమైన నాయకుడు, అందుకోసం కన్నతల్లి గురించి, సొంత చెల్లెలి గురించి సోషల్ మీడియాలో తన తొత్తులతో ఎలాంటి అసభ్యపు పోస్టులు పెట్టిస్తాడో తెలుసుకుని ప్రజలు విస్మయం చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరును అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబునాయుడు ప్రస్తావించిన సంగతులు దేశాన్నే ఆలోచనలో పడేస్తున్నాయి. సోషల్ మీడియా సైకోలను నియంత్రించడానికి, వారి దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయడానికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి కొత్త చట్టం తెస్తుందో.. అలాంటి చట్టాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలా జరక్కపోతే.. జగన్ వంటి సైకో దళాల నాయకులు… ఇతర రాష్ట్రాల్లోని రాజకీయాలను కూడా అసభ్యంగా బురదమయంగా మార్చేస్తారని భయపడుతున్నారు.
వర్రా రవీందర్ రెడ్డి విజయమ్మ గురించి పెట్టిన పోస్టులు ఇప్పుడు దేశమంతా ఆలోచన పరులైన అందరూ జగన్ దుష్టత్వం గురించి ఆలోచించే పరిస్థితి కల్పిస్తున్నాయి. జగన్ కన్నతల్లి గురించి సోషల్ మీడియాలో వచ్చిన అసభ్య పోస్టుల గురించి కూడా చంద్రబాబునాయుడే ఆవేదన చెందుతున్నారు.
వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత.. అతనితో తమకు సంబంధం లేదని చెప్పి వైసీపీ నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వర్రా తో వారికి సంబంధం ఉన్నదో లేదో గత అయిదేళ్ల కాల్ లిస్టులను పరిశీలిస్తే చిటికెలో పక్కా ఆధారాలు దొరికిపోతాయి. ఒక వ్యక్తి అడ్డంగా దొరికిపోతే.. వాడు తమ పార్టీ కాదని వదిలించుకోవడానికి వారు తాపత్రయపడుతున్నారు. అసలు తన తల్లి గురించి చేసిన వ్యాఖ్యలకు జగన్ స్పందించి.. వర్రా రవీందర్ రెడ్డి మీద తానే పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడమే పెద్ద వింత. అందుకే ఇవాళ జగన్ దుష్ట బుద్ధులు జాతీయస్థాయిలో చర్చనీయాంశాలు అవుతున్నాయి. సోషల్ సైకోల గురించి దేశమంతా చర్చ జరగాలని చంద్రబాబు అంటున్నారు గానీ.. జగన్ బుద్ధుల గురించి చర్చ జరిగితే చాలు.. అంతా సెట్ అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.