సినీ ఇండస్ట్రీలో నటీమణులు ఎక్కువ కాలం రన్ అవ్వాలంటే… ముఖ్యంగా ఉండాల్సింది అందం. రెండు ఫిజిక్. ఈ రెండు లేకపోతే ఒకటి రెండు సినిమాలకే తల్లిపాత్రలకు పరిమితం కావాల్సి ఉంటుంది. అందుకే హీరోయిన్లు చాలా మంది వయసులో ఉన్నప్పుడే తీరిక లేకుండా సినిమాలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే వారు ఫిట్నెస్ కోసం జిమ్ లో చెమటలు చిందిస్తుంటారు. తెర మీద ఎంతో అందంగా కనిపించినప్పటికీ వారు ఆ అందం కోసం ఎంత కష్టపడతారో తెలిస్తే అభిమానులు షాక్ అవుతారు. అప్పుడప్పుడు ముద్దుగుమ్మలు జిమ్ లో కష్టపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి.
ఈ క్రమంలోనే తాజాగా రష్మిక జిమ్ లో చెమటలు చిందిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. గత కొంత కాలంగా రష్మిక హిట్ల మీద హిట్లతో ముందుకు దూసుకుపోతుంది. ఇటు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ తన ఖాతాను ఓపెన్ చేసింది. యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇటు సౌత్ తో పాటు, అటు నార్త్ లో కూడా రష్మిక కు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎంత సినిమా షూటింగ్ లతో బిజీ గా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. తన తాజా చిత్రాల గురించి, వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజా వీడియోను ఒకదానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తుంది.