నారా రోహిత్… తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలు చేశాడు. 2014లో రాజకీయాల నేపథ్యంగా వచ్చిన చిత్రం ప్రతినిధి. దాదాపు ఆరు సంవత్సరాల తరువాత ఆ సినిమాకి సీక్వెల్ గా ప్రతినిథి 2 రాబోతుంది. అది కూడా ఎన్నికల ముందు. ఈ సినిమాకి ప్రముఖ జర్నలిస్టు మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ ను శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సినిమాలో సమకాలీన రాజకీయాంశాలతో పాటు పొలిటికల్ థ్రిల్లర్ అంశాలను కూడా ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తూ సినిమా సాగనుంది. సినిమాలో అంతా పేరున్న నటులే నటిస్తుండటం విశేషం. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
జనం కోసం బతికితే చచ్చాక కూడా బతికే ఉంటాం.. ఓటు వేయండి..లేదంటే దేశాన్ని వదిలి వెళ్లిపోండి…అది కుదరకపోతే చచ్చిపోండి! వంటి డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ప్రతినిధి సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా ప్రతినిథి 2 ఉండబోతున్నట్లు టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది.
ఎన్నికల సమయంలో ఇలాంటి సినిమాలు చాలా అవసరమని చాలా మంది అంటున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.