హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గుండె సమస్యలతో నిన్న మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ బై నాన్న అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. మీరు ఒక పెద్ద ఫైటర్ నాన్న.. మా కోసం మీరు జీవితంలో ఎన్నో త్యాగాలను చేశారు.
ప్రేమించడం, జీవితాన్ని గెలవడం నాకు నేర్పించారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే కారణం మీరు . ప్రజలను ప్రేమించడంతో పాటు.. మంచి కోసం పోరాడాలనే విషయాన్ని కూడా నేర్పించారు. ఎన్ని కష్టాలున్నా కూడా.. అవన్ని మా వరకు తీసుకురాకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేశారు.
మీతో నాకు జీవితాంతం మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు.. బై నాన్నా అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
రామ్మూర్తి నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుకి సోదరుడు. అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటి లేటర్‌పై చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు. ఈయన 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా చేశారు.