‘ది ప్యారడైజ్’ గురించి నాని ఏం చెప్పాడంటే!

నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న మూవీస్‌ లో ఊహించని బోల్డ్ అటెంప్ట్ మూవీ “ది ప్యారడైజ్” . దీనికి ముందు వచ్చిన హిట్ 3 టీజర్ చూసే అంతా షాక్ అయితే దాని నుంచి తేరుకునేలోపే ది ప్యారడైజ్ గ్లింప్స్ వచ్చి అంతకు మించి షాకిచ్చింది. ఇక ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుంది అనే దానిపై నాని సాలిడ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.

హాలీవుడ్ రిపోర్టర్ తో మాట్లాడుతూ ది ప్యారడైజ్ సినిమా థియేటర్స్ లో ఆడియెన్స్ పండగ చేసుకునే రీతిలో ఉంటుంది అని ఒక సీన్ తర్వాత మరొక సీన్, మరొక సీన్ తో మ్యాడ్ ఎనర్జీతో మంచి హై ఇచ్చే మూమెంట్స్ తో నోర్లు వెళ్ళబెట్టేలా ఉండబోతుంది అని ఇంతకు మించి ఈ సినిమా కోసం నేను చెప్పలేను అంటూ నాని ఇచ్చిన స్టేట్మెంట్ ఇపుడు ఫ్యాన్స్ లో మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 26న గ్రాండ్ గా పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ కి తీసుకురాబోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories