న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ చుట్టూ మంచి హంగామా నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల పనిచేస్తుండటంతోనే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి.
ఇప్పుడిక సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో నాని మూడు వేరువేరు గెటప్పుల్లో కనిపించనున్నాడట. వాటిలో ఒక పాత్ర నెగటివ్ షేడ్‌తో ఉండబోతోందని టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానుల్లో మరింత ఎగ్జైట్మెంట్ మొదలైంది.
ఇంతకుముందు కూడా నాని యాంటీ షేడ్ ఉన్న పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి పవర్ఫుల్ రోల్ చేయబోతున్నాడని తెలిసి, ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. ఈ కారణంగానే ‘ది ప్యారడైజ్’ సినిమా మీద కురుస్తున్న హైప్ రోజురోజుకూ పెరుగుతోంది.