నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ వైలెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. మరి శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది కాగా భారీ హైప్ ఈ సినిమాపై నెలకొంది. ఇక నాని సినిమాలకి యూఎస్ మార్కెట్ లో ఎంత స్ట్రాంగ్ గా వసూళ్లు ఉంటాయనేది చెప్పాల్సిన అవసరం లేదు.
మరి ఇది మరోసారి హిట్ 3 విషయంలో రివీల్ అయ్యింది అయ్యింది అని చెప్పొచ్చు. హిట్ 3 యూఎస్ నార్త్ అమెరికాలో ఇపుడు 3 లక్షల డాలర్స్ మార్క్ ని కేవలం ప్రీ సేల్స్ లోనే రాబట్టేసి దూసుకుపోతుంది. మరి ఈ మూవీ ప్రీమియర్స్ సహా డే 1 కి ఏ రేంజ్ నంబర్స్ ని సెట్ చేస్తుందో అనేది ఎదురు చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా నాని నిర్మాతగా కూడా ఈ సినిమాకి వహించారు. అలాగే ఈ మే 1న పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.