కష్టాలు తప్పేట్లు లేవుగా!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హిట్-3’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలను పెంచాయి. అయితే, ఈ సినిమాకు సెన్సార్ కష్టాలు తప్పేలా లేవని తెలుస్తోంది.

‘హిట్-3’ మూవీలో బ్లడ్ బాత్ ఎక్కువగా ఉండనుందని ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండనుండటంతో ఈ సినిమాలోని చాలా సీన్స్ సెన్సార్ కట్‌కు గురయ్యే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారట. దీనికోసం వారు ఇప్పటికే సెన్సార్ బోర్డు సభ్యులకు సినిమాను చూపెట్టారని.. వారి రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారట. సెన్సార్ సభ్యులు సూచించ కట్స్ కోసం నాని అండ్ టీమ్ రెడీగా ఉన్నారట. వారు ముందుగానే ఈ చిత్రానికి సెన్సార్ కట్‌ కచ్చితంగా ఉంటాయని చాలా దీమాగా ఉన్నారని సమాచారం.

అంతేగాక, ఈ కట్స్‌ను వారు ఎలా రీప్లేస్ చేయాలనే అంశంపై కూడా కసరత్తులు చేయనున్నారట. ఏదేమైనా ఈ సినిమాలోని వయెలెన్స్ ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని చిత్ర యూనిట్ కూడా చెబుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories