ముహుర్తం కుదిరింది!

నేచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. పూర్తి కోర్టు డ్రామా మూవీగా రానున్న ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేస్తున్నారు. 

ప్రియదర్శి ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే, తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ సాంగ్ మెలోడీ ట్యూన్‌తో ప్రేక్షకులకు ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అవుతోంది. 

ఇక ఈ పాటను రేపు(ఫిబ్రవరి 14) సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి అపళ్ల, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories