పోస్టర్‌ తో అదరగొట్టిన నాని!

పోస్టర్‌ తో అదరగొట్టిన నాని! నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా సినిమా “సరిపోదా శనివారం”తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది టాలీవుడ్ అందుకున్న సాలిడ్ హిట్స్ లో ఈ మూవీ కూడా ఒకటి. అయితే ఈ సినిమా తర్వాత నుంచి వస్తున్న మోస్ట్‌ అవైటెడ్ మూవీస్ లో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవ “హిట్ 3” గురించి అందరికీ తెలిసిందే. 

ఇందులో నాని అర్జున్ సర్కార్ గా కనిపించనున్నట్లు టాక్‌ వినపడుతుంది. అయితే తాను ఈ కొత్త సంవత్సరం కానుకగా సాలిడ్ పోస్టర్ తో అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు. మరి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తూ మీసాలు దువ్వుతున్న అర్జున్ సర్కార్ లా నాని ఇందులో అదరగొట్టాడు అని చెప్పుకొవచ్చు. దీంతో ఈ పోస్టర్ చూసిన తన ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ మోస్ట్‌ అవైటెడ్ మూవీని మేకర్స్ ఈ 1న గ్రాండ్ గా విడుదలకి తీసుకుని వస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories