ఆ డైరెక్టర్‌ తో నాని మరోసారి!

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ అనే ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తూ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండటంతో, ఇది కూడా బాక్సాఫీస్ వద్ద హైప్ క్రియేట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం నాని తనకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడితో మళ్లీ కలిసి పని చేయబోతున్నట్టు తెలుస్తోంది.

‘హాయ్ నాన్న’ సినిమాతో నాని కెరీర్‌లో మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చిన దర్శకుడు శౌర్యువ్ మరోసారి నానితో సినిమాకు సిద్ధమయ్యాడు. ఈసారి మాత్రం ఫ్యామిలీ టచ్ కంటే మాస్ అప్‌పీలో సినిమా ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

శౌర్యువ్ ఈ సినిమా కోసం ఓ కొత్త స్టైల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. నానికి సూటయ్యేలా మాస్ ఎలిమెంట్స్ తో కథను మలచినట్టు సమాచారం. ఇప్పటికే నాని కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రావొచ్చని అంటున్నారు.

ఇక ఈ కాంబినేషన్ మీద అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ‘హాయ్ నాన్న’ లాంటి ఫీల్ గుడ్ సినిమా తర్వాత ఈ జోడీ మళ్లీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories