ఆ డైరెక్టర్‌ కి నాని గ్రీన్ సిగ్నల్‌!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నాని.. మరో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు రెండు వైవిధ్యమైన నేపథ్యంలో రాబోతున్నాయి. ఇక ఇప్పుడు నాని మరో క్లాసిక్ డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్లు  వార్తలు వినపడుతున్నాయి.

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ మూవీస్‌ డైరెక్టర్‌ గా  తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ ని క్రియేట్‌ చేసుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నానితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

దీంతో నాని కోసం శేఖర్ కమ్ముల ఎలాంటి కథను సిద్ధం చేస్తాడా.. ఈ సినిమాతో వీరిద్దరి కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories