తన నెక్ట్స్‌ సినిమా ఏంటో చెప్పేసిన నాని..దర్శకుడు ఎవరంటే!

నేచురల్‌ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్‌ ఖుషీలో ఉన్నాడు. ఎందుకంటే నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాల దర్శకులు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరక్టర్లుగా అవార్డులు అందుకోవడంతో పాటు, దసరా చిత్రంలో అద్భుత నటనకు నాని బెస్ట్ హీరోగా అవార్డు అందుకుని ఆ ప్రౌడ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు.

 ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ పోలీసులతో సరదగా ముచ్చటించారు. పోలీసుల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు నాని. ఈ క్రమంలోనే నాని చేయబోయే తర్వాతి సినిమా అప్ డేట్ ఇచ్చాడు.

నాని మాట్లాడుతూ “ ఈ నెల 29న నా సరిపోదా శనివారం అభిమానుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా విడుదల అయిన సరిగ్గా 4 లేదా 5 రోజుల తర్వాత నా తరువాత సినిమా ప్రకటించేద్దాం అని అంతా రెడీ చేసాను. కానీ ఇప్పుడు ఇంత కంటే మంచి సందర్భం రాదు, నా తరువాతి సినిమాలో నేను పోలీస్ గా నటిస్తున్నాను” అని తెలిపాడు. HIT  ఫ్రాంచైజ్ లో భాగంగా  HIT  -3 లో శైలేష్ కొలను దర్శకత్వంలో నటిస్తున్నాడు నేచురల్‌ స్టార్‌.

Related Posts

Comments

spot_img

Recent Stories