సెప్టెంబర్‌ 5న ఆ డైరెక్టర్‌ తో రెడీ అయిపోతున్న నాని!

నేచురల్‌ స్టార్‌ నాని టాలీవుడ్‌ వరుస సినిమా హిట్ల తో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా విడుదలైన సరిపోదా శనివారం తో సూపర్ హిట్‌ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. దసరా, హాయ్ నాన్న తాజగా సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు నాని.

నేచురల్ స్టార్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు తెచ్చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. ‘సరిపోదా శనివారం’ సినిమా నుండి ఇప్పుడే బయటకు వచ్చాడు నాని. సో ఇక నాని నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం నాని తన నెక్ట్స్ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో HIT  ఫ్రాంచైజ్ తీసుకువచ్చాడు. మొదటి పార్ట్ లో యంగ్ హీరో విశ్వక్ సేన్ యాక్ట్‌ చేయగా, రెండవ పార్ట్ లో అడివి శేష్ చేశాడు. మొదటి రెండు భాగాలు హిట్ కావడంతో హిట్ 3ని నిర్మించబోతున్నారు.ఈ దఫా పోలీస్ క్యారక్టర్ లో నాచురల్ స్టార్ నాని యాక్ట్‌ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పూజ కార్యక్రమాలను సెప్టెంబరు 5న మొదలు పెట్టనున్నట్టు మూవీ టీమ్‌ తెలిపారు.

మరోపక్క నాని నిర్మాతగా వాల్ పోస్టర్ బ్యానర్ లో మరో సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. బలగం సినిమాతో నటుడిగా ఆకట్టుకున్న ప్రియదర్శి హీరోగా కోర్ట్ ‘స్టేట్ vs ఏ నోబడి’ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు. 

Related Posts

Comments

spot_img

Recent Stories