న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తూ ఉన్న కొత్త సినిమా ది ప్యారడైజ్ చుట్టూ మంచి హైప్ నెలకొంది. మొదటి గ్లింప్స్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను పూర్తి హై వోల్టేజ్ మాస్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో సాగుతోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్‌ని ప్రముఖ ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ కంపోజ్ చేస్తున్నారు. అంతే కాకుండా, కొన్ని విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా ఈ యాక్షన్ సీన్‌కి కలిసి పని చేస్తున్నారు.
ఈ యాక్షన్ భాగం సినిమా మొత్తంలో ఒక పెద్ద హైలైట్‌గా నిలుస్తుందనే బజ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ విషయానికి వస్తే, యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
ఇక సినిమా విడుదల తేదీ కూడా ముందే లాక్ చేసినట్లు సమాచారం. అన్ని పనులు టైమ్‌కి పూర్తవుతాయన్న నమ్మకంతో మేకర్స్ 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.