విశ్వక్‌ తో నాని భామ!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘మెకానిక్ రాకీ’ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో.. ఆ తరువాత కూడా పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇందులో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్‌తో ఓ సినిమా కూడా ఉంది. ఈ కాంబోలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త వినపడుతుంది.ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించనుందంట. ప్రియాంక ఇటీవల నేచురల్ స్టార్ నాని సరసన ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ సొంతంచేసుకుంది

దీంతో, ఇప్పుడు ఆమె విశ్వక్ సేన్ సరసన నటించనుందనే టాక్ ప్రస్తుతం జోరుగా వినిపిస్తుండటంతో అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories