ఓవరాక్షన్ తో మళ్ళీ కటకటాల్లోకి నందిగం!

మాజీ ఎంపీ అయినప్పటికీ తన స్థాయి బజారు రౌడీ మాత్రమేనని మరోసారి నిరూపించుకున్న నందిగం సురేష్ మళ్ళీ రిమాండులో జైలుకు వెళ్ళారు. మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా కొంతకాలం జైల్లో గడిపి బెయిలు మీద బయటకు వచ్చిన ఆయన కనీసం తన దాదాగిరీని, దాష్టీకాలను కొన్నాళ్లు కంట్రోల్ లో ఉంచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. వేగంగా కారులో వెళ్లి తెలుగుదేశం కార్యకర్త రాజును ఢీకొట్టడం మాత్రమే కాదు, స్లోగా వచ్చి ఉండొచ్చు కదా అని అడిగిన పాపానికి.. అతని మీద దాడిచేసి, చితక్కొట్టడం, తన తమ్ముడితో కలిసి తన ఇంటికి తీసుకువెళ్లి నిర్బంధించి చితక్కొట్టడం అతని దాష్టీకానికి పరాకాష్ట. హత్య కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న ఈ నిందితుడు.. ఈ రేంజిలో ఓవరాక్షన్ చేయడం వల్ల మళ్లీ రిమాండుకు వెళ్లారు. ఈ దాడికేసులో నందిగం సురేష్ కు జూన్ 2వ తేదీ వరకు రిమాండు విధిస్తూ మంగళగిరి కోర్టు తీర్పు చెప్పింది.

17వ తేదీ శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో తెలుగుదేశం కార్యకర్త రాజు సెంటర్ లో ఉండగా.. వేగంగా దూసుకొస్తున్న నందిగం సురేష్ కారు అతడిని ఢీ కొట్టింది. సురేష్, ఆయన సోదరుడు వెంకట్ కూడా  ఆగ్రహంతో కారులోంచి దిగి మూకుమ్మడిగా రాజుపై దాడిచేసి చితక్కొట్టారు. వెనకనే మోటార్ సైకిళ్లపై వచ్చిన నందిగం సురేష్ అనుచరులు కూడా దాడిచేసి కొట్టారు. అక్కడితో వదలకుండా రాజును నిర్బంధించి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ సురేష్ భార్య బేబి అతడిని చెప్పుతో కొట్టారు. ఆయన అనుచరులందరూ అతడిని కర్రలతోను, రాళ్లతోను కొట్టారు.

‘వీడు మనకు తలనొప్పిగా మారాడు చంపి నదిలో పారేయండి రా’ అంటూ హుకుం జారీ చేశారు. ఈలోగా రాజు భయపడి అక్కడినుంచి పారిపోయి బంధువుల సహకారంతో మంగళగిరి ఎయిమ్స్ లో చేరాడు. అతని భర్య చైతన్యలక్ష్మి ఫిర్యాదు చేయడంలో నందిగం సురేష్ ఏ1గా, సోదరుడు వెంకట్ ఏ2 గా, ఏ3గా బేబి పేర్లతో  కేసు నమోదు అయింది.పోలీసులు వచ్చి నందిగం సురేష్ ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
అయితే ఆ తర్వాత సురేష్ భార్య బేబి పోలీసు స్టేషన్కు వెళ్లి నానా హంగామా చేయడం గమనార్హం. పోలీసులను ఆమె నానా దుర్భాషలాడారు. దాడిచేసి 24 గంటలైనా కాకముందే వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్తారా అంటూ రంకెలు వేశారు. సోమవారం కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా ఆయనకు జూన్ 2 వరకు రిమాండు విధించారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories