నందమూరి వారసులే!

నందమూరి వారసులే! బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఇటీవల టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఆమె రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రంలో నటించగా అందులో కేవలం డ్యాన్స్ నెంబర్‌కే పరిమితం కాలేదు. ఓ కీలక పాత్రలో ఆమె నటించి తన సత్తా చాటుకుంది. ఇక ఆ సినిమాలో బాలయ్యతో కలిసి ఊరమాస్ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించింది. 

ఈ సినిమా ఊర్వశి రౌటేలాకు మంచి కాన్ఫిడెన్స్‌ను అందించింది. ఇక ఇప్పుడు మరో నందమూరి హీరో సినిమాలో ఈ బ్యూటీకి ఛాన్స్ దొరికినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్-నీల్ మూవీలోనూ ఈ అమ్మడికి ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. 

అయితే, ఇందులోనూ కేవలం డ్యాన్స్ నెంబర్‌కే పరిమితం కాకుండా సినిమాలో ఓ ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఊర్వశి నటించనుందని తెలుస్తోంది. ఇలా నందమూరి హీరోల సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకుంటున్న ఊర్వశి రౌటేలాను తమ సినిమాల్లో తీసుకునేందుకు మిగతా మేకర్స్ కూడా ఆసక్తిని చూపుతున్నారట.

Related Posts

Comments

spot_img

Recent Stories