అసలు విషయం ఏంటంటే!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా తాజాగా డాకు మహారాజ్ అనే సాలిడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో పాటుగా బాలయ్య తన ఓటీటీ షోలో కూడా బిజీగా ఉన్నారు. అయితే ఈ బిజీ లోనే బాలయ్య తన వారసుణ్ణి సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం నందమూరి ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో సర్‌ప్రైజ్‌ చేస్తుంది.

కానీ రీసెంట్ గానే ఈ సినిమా ఆగిపోయింది అంటూ పలు రూమర్స్ మొదలయ్యాయి. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఆగిపోయినట్టేనా అని నందమూరి ఫ్యాన్స్ కూడా కొంత బాధ పడ్డారు. అయితే ఇపుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ అయితే వచ్చింది. వీరి కలయికలో సినిమా ఆగిపోలేదట.

జస్ట్ ముహూర్తం వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రేజీ కాంబోలో సినిమా ఇంకా ఆన్ లోనే ఉందని చెప్పాలి. ప్రశాంత్ వర్మ ఆల్రెడీ మోక్షజ్ఞ్యని సాలిడ్ లెవెల్లో సిద్ధం చేస్తున్నాడు. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది.

Related Posts

Comments

spot_img

Recent Stories