ఆ బాలీవుడ్‌ సినిమాలో కింగ్‌ నాగార్జున!

ఆ బాలీవుడ్‌ సినిమాలో కింగ్‌ నాగార్జున! బాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్‌ గా రాజ్‌కుమార్ హిరానీకి చాలా మంచి పేరు ఉంది. ఐతే, బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌ దత్ హీరోగా తెరకెక్కిన మున్నాభాయ్ MBBS, లగే రహో మున్నాభాయ్ చిత్రాలు అద్భుత విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మూడో పార్ట్‌‌ కోసం కసరత్తులు మొదలు పెట్టారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోంది. 

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినపడుతుంది. ఈ సినిమాలో సౌత్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో నటిస్తాడని సమాచారం. అయితే, నాగార్జున నటిస్తున్నాడనే వార్త పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక రాజ్‌కుమార్ హిరానీకి బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో సడెన్ గా రాజ్‌కుమార్ హిరానీ మున్నాభాయ్-3ని ఎనౌన్స్ చేయడం, పైగా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఉంటాడని వార్తలు వస్తుండటం విశేషం. పైగా సంజయ్ దత్ తో తాను చేసిన గత సినిమాల కంటే మెరుగ్గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాజ్‌కుమార్ హిరానీ పేర్కొన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories