నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం అదే!
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ధనుష్ కాంబోలో కుబేర సినిమా లో నటిస్తున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ.. సినిమాలు చేస్తూ వారికి గట్టి పోటీని ఇస్తున్నాడు. తాజాగా నాగార్జున తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో పంచుకున్నారు.
నాగార్జున రెండు పెళ్లిళ్లు అనే విషయం తెలిసిందే. నాగార్జున ముందుగా నటుడు వెంకటేష్ చెల్లి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వారికి నాగచైతన్య పుట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తరువాత నాగ్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి అఖిల్ పుట్టాడు.
తాజాగా నాగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఇదే. లక్ష్మితో విడాకులు తీసుకున్న తర్వాత చైని తన తల్లి దగ్గరకే పంపాల్సి వచ్చింది. నేను చాలా బాధ పడిన క్షణాలవే. కానీ తప్పదు ఎందుకంటే చై వాళ్ల అమ్మ దగ్గరే పెరగాలి కాబట్టి పంపించాను. కానీ అప్పుడు కూడా వాడు అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ వెళుతూ ఉండేవాడు అది కాస్త సంతోషాన్ని కలిగించింది. ఇక తన చదువు అయిపోగానే హైదరాబాద్‌కు వచ్చి నాతోనే ఉండిపోయాడు. అయినప్పటికీ నాగచైతన్య చిన్నతనంలో నాతో లేడన్న బాధ ఇప్పటికీ ఉంటుంది. ’’ అని నాగ్ చెప్పుకొచ్చాడు.