ఇంకా ఆ టైమ్‌ రాలేదులే!

టాలీవుడ్‌లో నిర్మాతగా పేరుపొందిన నాగవంశీ సినిమాలను నిర్మించడమే కాకుండా డిస్ట్రిబ్యూషన్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన తీసుకున్న పెద్ద రిస్క్ “వార్ 2”ని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేయడమే. ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ఈవెంట్‌లో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు చాలా హైలైట్ అయ్యాయి. ఎన్టీఆర్ ఈ చిత్రంతో కొత్త రికార్డులు సాధిస్తారని, తెలుగు ప్రేక్షకులు హిందీ కంటే కూడా పెద్ద హిట్‌గా మార్చుతారని ఆయన అప్పట్లో నమ్మకంగా చెప్పాడు.

అయితే సినిమా ఆశించిన స్థాయిలో నడవకపోవడంతో నాగవంశీ చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. “వార్ 2” ఫెయిల్ అవుతోందని, ఇక నాగవంశీ కెరీర్ కూడా ముగిసిపోయిందని అనేక మంది నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ మధ్య జరుగుతున్న ట్రోలింగ్‌పై నాగవంశీ స్పందించాడు. సోషల్ మీడియాలో తన గురించి ఎన్నో రకాల కథలు రాస్తున్నారని, తనను మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందని చెప్పాడు. నిజానికి సోషల్ మీడియాలో రైటర్లు చాలా టాలెంటెడ్‌గా ఉంటారని, కానీ తన పని అయిపోయిందని అనుకునే వారు ఇప్పుడు నిరాశ చెందాల్సి వస్తుందని స్పష్టంగా చెప్పాడు. సినిమాలను ఆపే సమయం తనకు ఇంకా రాలేదని, ముందూ తన ప్రయాణం కొనసాగుతుందని క్లియర్ చేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories