యువసామ్రాట్ , యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన తాజా సినిమా ‘తండేల్’ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగచైతన్య ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఎంతంటే.. తాను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నానని.. ఇప్పుడు వైజాగ్ తన ఇంట్లో కూడా ఉందని.. తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ యే అని.. నాగచైతన్య కామెంట్ చేశాడు. తన భార్య శోభిత ధూళిపాళకు సంబంధించి చైతూ ఇలా కామెంట్ చేసినట్లు అభిమానులు చెబుతున్నారు.
ఇక తండేల్ చిత్రం కోసం తామందరం తీవ్రంగా కష్టపడ్డామని చైతూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో చైతూ పాత్ర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా రూపొందించారు. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను కంప్లీట్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.