లవ్‌ సితార అంటున్న నాగ చైతన్య ఫియాన్సీ!

జీ 5 నుంచి రాబోతున్న ఒరిజినల్‌ ఫిల్మ్ ‘లవ్, సితార’ సెప్టెంబర్ 27 నుంచి ఈ మూవీస్ట్రీమింగ్ కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ ఫ్యామిలీ డ్రామా రూపుదిద్దుకుంది. ఓ కుటుంబంలోని స‌భ్యుల మ‌ధ్య ఉండే వివిధ ర‌కాలైన స‌మ‌స్య‌ల‌ను, ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేసే సినిమా ఇదని ట్రైల‌ర్‌ను చూస్తుంటే తెలుస్తుంది.

రోనీ స్క్రూవాలా RSVP మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా డైరెక్షన్‌ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే… ప్ర‌కృతి అందాల‌తో ఆక‌ట్టుకునే కేరళ పచ్చటి అందాల న‌డుము తెర‌కెక్కిన క‌థలా ఈ సినిమా కనిపిస్తుంది. తార‌ (శోభితా ధూళిపాళ) ఓ స్వతంత్య్ర భావాలున్న ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌. అంత‌ర్జాతీయంగా మంచి పేరున్న చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ)తో ప్రేమాయణం నడుపుతుంది.

వారిద్ద‌రూ పెళ్లికి ముందు తార ఇంటికి వెళ‌తారు. అక్క‌డ పెళ్లి జ‌రగ‌టానికి ముందు కుటుంబాల్లోని విభేదాలు, తెలియ‌కుండా దాగిన నిజాలు వీరి ముందుకు వస్తాయి. చివ‌ర‌కు ఈ జంట ప్ర‌యాణం ఎటువైపు సాగింద‌నేదే ఈ మూవీ కథ. బి.జయశ్రీ, రోడ్రిగ్స్, సంజయ్ భూటియాని, సోనాలి కులకర్ణి, , తమరా డిసౌజా, రిజుల్ రే కీలక పాత్ర‌ల్లో న‌టించారు. లవ్, సితార సెప్టెంబర్ 27న జీ5లో ప్రీమియర్‌గా ప్ర‌ద‌ర్శితం కానుంది.

ఈ సంద‌ర్భంగా శోభితా దూళిపాల‌ మాట్లాడుతూ,‘‘సితారలో నటించడం చక్కటి అనుభూతినిచ్చింది. నేను పోషించిన పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయి. వైవిధ్య‌మైన పాత్ర‌. స్వ‌తంత్య్ర భావాలున్న ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ పాత్ర‌లో చేశాను. నిజాయ‌తీగా ఉండే ఓ అమ్మాయి త‌న జీవితంలో ఎదురైన స‌వాళ్ల‌ను ధైర్యంగా ఎలా ఎదుర్కొంది అనేదే క‌థ‌. చ‌క్క‌టి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి”అని శోభిత చెప్పుకొచ్చారు.

Related Posts

Comments

spot_img

Recent Stories