టాలీవుడ్‌లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా గుర్తింపు పొందిన ‘చంద్రలేఖ’ సినిమాలో కింగ్ నాగార్జునతో కలిసి నటించిన నటి ఇషా కొప్పికర్ చేసిన కామెంట్లు ఇప్పుడు సినిమావర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అప్పట్లో ఇది ఆమె నటించిన రెండో సినిమా కావడంతో, నటన పరంగా అనుభవం తక్కువే.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక కీలక సన్నివేశంలో నాగార్జున ఆమె చెంపపై కొట్టాల్సి ఉంటుంది. అయితే ఆ సీన్‌లో ఎమోషన్ సరిగ్గా బయటపడడం లేదని దర్శకుడికి అనిపించడంతో ఇషానే ముందుగా వెళ్లి నాగార్జునను నిజంగా కొట్టమని చెప్పిందట. మొదట నాగార్జున తేలిగ్గా చేయగా, మళ్ళీ మళ్ళీ టేక్స్ రావడం వలన చివరకు దాదాపు 15 సార్లు నిజంగా చెంపదెబ్బ తినాల్సి వచ్చిందట.
అంతేకాదు ఆ టేక్స్ తర్వాత ఆమె బుగ్గపై గాట్లు పడినట్టు చెప్పింది. ఆ విషయాన్ని గమనించిన నాగార్జున వెంటనే ఆమెను బాగా అడిగి, సారీ కూడా చెప్పారట. అయితే అప్పటి ఆ అనుభవం ఇప్పుడు ఆమెకు తలచుకుంటే షాకింగ్ గా, అలాగే ఆసక్తికరంగా అనిపిస్తోందని తెలిపింది. ఈ విషయాలు ఇప్పుడు వైరల్ కావడం వల్ల సినిమాపై మళ్లీ దృష్టి పడింది.