రొమాంటిక్ మెలోడిగా ‘నదివే’

నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న నటిస్తున్న తాజా సినిమా “ది గర్ల్‌ఫ్రెండ్” పై ఆసక్తి రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే వరుస విజయాలతో క్రేజ్ మీదున్న రష్మిక ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోందని తెలిసినప్పటి నుంచే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాతో సంబంధించి మొదటి మ్యూజిక్ అప్డేట్ వచ్చింది.

హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచిన “నదివే” అనే మెలోడీ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సాఫ్ట్ మ్యూజిక్‌తో, ఫీల్‌గుడ్ ట్యూన్స్‌తో ఎంతో హాయిగా సాగుతుంది. మెలోడీ తరహాలో రూపొందిన ఈ పాటను స్వయంగా హేషమ్ పాడిన తీరు మంచి అనుభూతిని ఇచ్చేలా ఉంది. స్క్రీన్ మీద రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కలసి అందమైన స్టెప్పులతో ఆ పాటను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

ఈ సినిమాకు దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ వ్యవహరిస్తున్నాడు. ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, ఫస్ట్ సాంగ్ వదిలిన దగ్గర నుంచి సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం మ్యూజిక్ అప్డేట్‌తో మంచి శభ్దం తెచ్చుకున్న ఈ సినిమాకి సంబంధించి మిగతా వివరాల కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. రష్మిక ప్రెజెన్స్‌కి తోడు, కథా పరిణామాల మీద కూడా మంచి ఆసక్తి నెలకొంది.

Related Posts

Comments

spot_img

Recent Stories