చెల్లెమ్మ అడుగుతోంది చెప్పండి జగనన్నా!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞత కోల్పోతున్నదేమో అనిపిస్తుంది. తాము చంద్రబాబు నాయుడు మీద పోరాడుతున్నాం అనేది కూడా మర్చిపోతున్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది. వైయస్ షర్మిల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. తల్లికి వందనం పథకం విషయంలో షర్మిల విమర్శలను ఎద్దేవా చేయాలని ప్రయత్నించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆభాసుపాలవుతున్నది.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా నెల కూడా గడవకముందే తాను ఇచ్చిన హామీలలో ఎంతో కీలకమైన తల్లికి వందనం పథకం కూడా అమలులోకి తో చేసిన సంగతి తెలిసిందే. ఒక తల్లికి ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఉంటే ఇద్దరి తరఫున కూడా చెరి 15 వేల రూపాయలు ఆమె ఖాతాలో వేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఆ మాట నిలబెట్టుకుంటూ జీవో తీసుకువచ్చారు. జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకం కంటే మరింత మెరుగ్గా ప్రజలకు మరింత మేలు చేసే విధంగా చంద్రబాబు తీసుకువచ్చిన ఈ పథకం పట్ల సహజంగానే వారు అసహనానికి గురయ్యారు. కుట్రపూరితమైన విమర్శలను ప్రారంభించారు.

నిజం చెప్పాలంటే వైఎస్ షర్మిల తాను కూడా చంద్రబాబు మీద ఏదో ఒక బురద చల్లారని అనుకుంటూ ఉన్నారు గనుక.. అలాగని ప్రత్యేకంగా ఏం మాట్లాడాలో తెలియక.. సాక్షి పత్రిక ద్వారా వైసీపీ చేసిన విమర్శలని తాను కూడా ప్రస్తావించారు. సాక్షి వార్తా కథనానికి చంద్రబాబు సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

అయితే అసహనంలో ఊగిపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిని అర్థం చేసుకోలేకపోయారు. ఆమె చంద్రబాబును సమర్థించినట్లుగా భావించుకుని.. కాంగ్రెస్ కూటమికి తోక పార్టీ అని వ్యాఖ్యానిస్తూ ఎద్దేవా చేశారు. దానిపై షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం గమనార్హం.

జగన్ ప్రభుత్వంలోకి వస్తే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఇద్దరికీ అమ్మ ఒడి ఇస్తానంటూ తనతో అప్పట్లో ప్రచారం చేయించుకున్న మాట నిజం కాదా అని ఆమె తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు.సంపూర్ణ మధ్య నిషేధం గురించి గానీ అన్ని నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని గాని జగన్ మోహన్ రెడ్డి తన ద్వారా ప్రజలకు చెప్పిన విషయం నిజం కాదా అని అడుగుతున్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కూడా అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనాలోచితమైన మాటల ద్వారా షర్మిలను రెచ్చగొట్టి తిట్టించుకుంటున్నారని ఆ పార్టీ నాయకులే భావిస్తుండడం విశేషం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కూటమితో కుమ్మక్కయినట్లుగా షర్మిలపై ఆరోపణలు చేసినా అర్థం ఉందని, ఇప్పుడు కూడా అదే తరహా విమర్శలు వేయడం పార్టీ పరువు తీస్తున్నదని వారు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories